Manasuni kadilinche iddari prema katha ,ఇద్దరి ప్రేమికుల ప్రేమ కథ


Telugu heart touching love story


ఒకరోజు అలా ఒంటరిగా సముద్రం అంచున పాదాలను కెరటాలు తాకేలా కూర్చున్నాను ఇంతలో ఒక అతను నా దెగ్గరికి వచ్చి కూర్చున్నాడు అతని బట్టలు కొంచం మురికిగా ఉన్నాయి చేతిలో ఒక సంచి ఉంది అందులోంచి ఒక డైరీ తీసి ఏదో రాసాడు జేబులోంచి కాస్లీ ఫోన్ తీసాడు బట్టలు మురికిగా ఉన్నాయి ఫోన్ ఏమో కాస్లీ గా ఉంది నాకేం అర్ధం కాలేదు కొద్దీ సేపటికి డైరీ సంచిలో పెట్టేసి నా వైపు చూస్తున్నాడు ఏంటండి అలా చూస్తున్నారు అన్నాను నీకు మహా అయితే ఒక 25 సంవత్సరాలు ఉంటాయి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయకుండా ఇలా తీరం దెగ్గర ఒంటరిగా కూర్చున్నావంటే నువ్వు చాలా సున్నితమైన మనసున్న  వాడివి ఏంటి లవ్ ఫెయిల్యూర్ హ అన్నాడు వెంటనే నేను హలో నా గురించి మీకెందుకు అన్నాను లేదు నేను చిన్నప్పటి నుండి ఇలాగే కూర్చునే వాణ్ణి  పెళ్లి జరిగాక పనుల్లో పడి ఇటు రావడం మనేషను మళ్ళీ ఒక మూడేళ్ళ నుండి మళ్ళీ సంవత్సరం కి ఒకసారి వచ్చి కూర్చుంటాను మూడేళ్ళ క్రితం నా కూతురు నా భార్య ఒక కారు ప్రమాదంలో చనిపోయారు అందుకే వల మెమోరీస్ తలుచుకోవడానికి వస్తాను సరే కానీ నీది లవ్ ఫెయిల్యూర్ హ అని అన్నాడు

        Telugu heart touching love story



హ అవును అన్నాను ఏంటి ప్రాబ్లెమ్ అన్నాడు డబ్బు అన్నాను వాళ్ళ నాన్నకి డబ్బు పిచ్చి నేను ప్రేమించిన అమ్మాయి నాకు నువ్వు  వద్దు అని చెప్పి మోసం చేసి వెళ్ళిపోయింది అని అన్నాను మరి వాల నాన్నను కలవక పోయావ...లేదు ఆ వల అమ్మాయి వద్దు అంది మరి నాకు డబ్బు లేదు అని తెలిసినప్పుడు ఎందుకు నన్ను ప్రేమించాలి అని అన్నాను ఏమో వల నాన్నకి డబ్బు ఉన్న అబ్బాయి తో వల అమ్మాయి సుఖంగా ఉంటుంది అనిపించింది ఏమో అన్నాడు చాలు చాలు లెవయ్య మీ పెద్ద వాళ్ళ ఆలోచనలే ఇంత తలుచుకుంటే సంపాదించలేమా అని అన్నాను మరి సంపాదించావా అని అడిగాడు...తను వెళ్లిన రెండేళ్లకే మంచి జాబ్ తెచ్చుకున్నాను మంచి సాలరీ కానీ ఇప్పుడు తను లేదు ఇదే రోజు సర్ తను లాస్ట్ కాల్ చేసింది...నాకు పెళ్లి ఫిక్స్ అయింది కార్డ్ ఇవ్వడానికి వస్తున్నాను అని చెప్పింది అప్పుడు కట్ చేశాను మళ్ళీ చేస్తే తన ఫోన్ కలవలేదు పోయింది సర్ ఎవణ్ణో ఒకన్నీ చూసుకొని వెళ్ళిపోయింది అందుకే ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి కూర్చుంటాను ఇన్ని వేళ కెరటాలు వడ్డుకి వచ్చి  వెళ్తాయి కదా కొన్నైనా నా జ్ఞాపకాలను  సముద్రంలోకి తీసుకెళ్తాయి కదా అని అన్నాను








జ్ఞాపకం అనేది మనం దులిపితే పోయే దుమ్ము కాదు వాటంతట ఆవే పోవాలి కానీ నువ్వు ఇంకా తలుచుకునే కొద్దీ ఇంకా పెరుగుతాయి అన్నాడు....సరే మరి మీరెంటి మీ బట్టలు ఇలా ఉన్నాయి మీ చేతిలో ఫోన్ మాత్రం కాస్లీ గా ఉంది కాళ్ళకి మంచి షూ ఉన్నాయి అని అడిగాను అంటే నేను చిన్నప్పుడు ఇంటింటికి వెళ్లి చెత్తని తీసుకొని వచ్చే వాణ్ణి ఒక రోజు ఒక అమ్మాయి తన ఎగ్జామ్ హాల్ టికెట్ మర్చిపోయింది వెళ్లి తనకి ఇచ్చి వచ్చాను నేను ఏదో పెద్ద పని చేసిన  ఫీలింగ్ నాకైతే లేదు అప్పటినుండి ఎప్పుడు ఆ ఏరియాకు వెళ్లిన చూసి నవ్వేది నాకు భయం వేసేది ఒకరోజు నేను తన ఏరియా నుండి వెళుతున్నావుడు నపైన ఒక లెటర్ వేసింది....చదవగానే నా గుండె వేగంగా కొట్టుకుంది వెంటనే అక్కడినుండి వెళ్ళిపోయాను ఒక నాలుగు నెలలు అటువైపు వెళ్ళలేదు...ఒక రోజు మా ఇంటికి వచ్చింది...పూరి గుడిసెలో ఉన్న వాణ్ణి వచ్చి ఏంటి ఇది అలా సమాధానం చెప్పకుండా వెళ్లిపోయావ్..అని అడిగింది అమ్మ మిరెక్కడ నీనెక్కడ మీ ఇంటి ముందు గేటు ని కూడా తకడనికి అర్హత లేని నన్ను మీరు ప్రేమించడం ఏంటి తమాషాగా ఉందా అండి అని అడిగాను




నువ్వు ఒప్పుకుంటే ఆ గేటు గీత దాటడానికి సిద్ధంగా ఉన్నాను అంది అది ఇది చనిపోతాను అని ఎన్నో అంది ఆఖరికి ఒప్పుకున్నాను ఒక రోజు వాళ్ళ నాన్న గారికి తెలిసి మా గుడిసెను తగల బెట్టేసాడు చెత్త ఎరుకునే వాడివి నీకు న కూతురు కావాలా ఇంకోసారి నా కూతురు వైపు చూస్తే ఈసారి గుడిసె వదిలేసా తరువాత నిన్నే తగలబెడతా ఈ ఊర్లో కానిపించకు అని వెళ్ళిపోయాడు చాలా ఏడుపొచ్చింది అరే చెత్త వాణ్ణి అయితే నాకు మనసు ఉండదా సరే గొప్పోళ్ళు ప్రేమించడం తప్పు అయితే ఆ గొప్పోళ్ళు మమ్మల్ని ప్రేమించడం కూడా తప్పే అని అతను అన్న మాటలకు చాలా ఏడ్చి ఊరు వదిలి వెళ్లిపోయాం నేను మా అమ్మ నాన్న మాత్రమే కాదు నాతో పాటు ఆ అమ్మాయి కూడా వచ్చింది ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నాం






ఒక ఐదేళ్ళల్లోనే చాలా సంపాదించాను..అని అన్నాడు మరి కేవలం ఒక హల్ టికెట్ ఇస్తే అంత ప్రేమించిందా అని అడిగాను హ హ అని చిన్నగా నవ్వి తాను ఎగ్జామ్ రాసె సెంటర్ ఒకప్పుడు నేను చదివిన కాలేజ్ అక్కడ ఎక్కడ చూసినా టాప్ లో నా పేరు ఉంటుంది అవన్నీ తెలుసుకొని నన్ను ఇలా చూసి ప్రేమించింది అని అన్నాడు మరి తరువాత చదవలేదా అని అడిగాను..అంత చదివి చెత్త తిస్తున్నానంటే అర్ధం అవ్వట్లేదా  అన్నాడు అలా జరిగింది లక్షలు సంపాదించాను కొన్ని సంవత్సరాలు అయినా వాళ్ళ నాన్న కోపం పోలేదు నాకు కూతురు పుట్టింది పెళ్లీడుకోచింది అప్పుడు వెళ్లం తన ముందుకు అయినా అవే మాటకు అన్నాడు ఎంత డబ్బులు పెట్టి కొన్న కూడా చెప్పుల్ని తలా మీద పెట్టుకోమ్ అన్నాడు సరే అని బయటికి వచ్చాము అంతకు ముందే నా కూతురు ఒక అబ్బాయి ని ప్రేమించాను అంది ఆలోచించాను అరా తీశాను ఆ అబ్బాయి చాలా మంచి వాడు లైఫ్ మీద కసి ఉన్నవాడు కానీ ప్రేమ మోజులో పడి లైఫ్ ని యూ టర్న్ తూసుకుంటుంటే వాడి చేతుల మీద వాడి లైఫ్ నే సెట్ చేయించాను వాడికి నేనెప్పుడూ కనిపించలేదు కానీ ఆ ప్రమాదంలో నా కూతురు మీద ఆ అబ్బాయి కి చెడు అభిప్రాయం మొదలయింది వెంటనే ధన్ మని లేచి
 అలా షాక్ అయి సర్ మీరు చిన్ని వాళ్ళ నాన్న గారా అన్నాను తాను లేచి అవును అన్నాడు నేను ప్రేమించిన అమ్మాయి వాళ్ళ నాన్న గరే ఇతను అలా హగ్ చేసుకొని అంటే సర్ చిన్ని చనిఊయిందా అన్నాను ఏడుస్తూ అవును అన్నాడు


నీకు జాబ్ రాగానే సర్ప్రైజ్ ఇద్దాం అని నేను నా కూతురు నా భార్య ముగ్గురం వస్తుంటేనే ప్రమాదం జరిగింది నీ ప్రేమ నిన్ను మోసం చేయలేదు ప్రేమ విలువ తెలుసు కాబట్టే ఒప్పుకున్నాను నీ జీవితాన్ని దారిలోకి తెచ్చాను తీరా నవ్వుతూ ఉందాం అందరం అనుకునే లోపే
ఇలా జరిగింది అందుకే నేను మొదట్లో నా ప్రేమకు ఎలా కనిపించనో అలాగే ఇక్కడికి వస్తాను నీకు జాబ్ ఇప్పించింది నేనె ప్రేమలో ఒడిపోయాను అని ఏడుస్తూ కూర్చుంటావ్ అనుకున్న కానీ ఇంకా ఇంకా ఆ ప్రేమను తలుస్తూనే ఎదిగావ్ నిన్ను చూస్తే నన్ను నేను చూసుకున్నటుంది నాన్న అని అన్నాడు నాకు ఏడుపొచ్చిందు నిన్ను కలిసి ఇవ్వన్నీ చెపొద్దు అని అనుకున్న కానీ నా కూతుర్ని ఇంకా మోసం చేసింది అని ఫీల్ అవుతున్నవేమో అని చెప్తున్న అని అన్నాడు


ఫ్రెండ్స్ ఈ కథలో ప్రేమ గొప్పతనం చెప్పడానికి ప్రేమ ఎన్ని కారణాల ద్వారా దూరం అవ్వచ్చు అని చెప్పడానికి మోసం చేసిన వాళ్లనే తలుచుకుంటూ ఏడుస్తూ బ్రతకొద్దు అని చెప్పడానికి కథ రాసాను
Manasuni kadilinche iddari prema katha ,ఇద్దరి ప్రేమికుల ప్రేమ కథ Manasuni kadilinche iddari prema katha ,ఇద్దరి ప్రేమికుల ప్రేమ కథ Reviewed by Telugu shayari on May 23, 2020 Rating: 5

No comments:

Thanks for visiting

Powered by Blogger.